Andhra Pradesh: ఏపీకి మోదీ వచ్చి ప్రత్యేక హోదాపై సరైన ప్రకటన చేయాలి: చలసాని శ్రీనివాస్

  • ప్రత్యేక హోదా’ ను రాజకీయంగా ఉపయోగించుకోవద్దు
  • వచ్చే ఆదివారం విజయవాడలో సమావేశం నిర్వహిస్తాం
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తాం

కేంద్రంలో కొంతమంది బీజేపీ ఎంపీలు ప్రత్యేక హోదాకు అనుకూలంగానే ఉన్నారని,  ఏపీకి ప్రధాని మోదీ వచ్చి ప్రత్యేక హోదాపై సరైన ప్రకటన చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రత్యేక హోదా’ ను రాజకీయంగా ఉపయోగించుకోవద్దని పార్టీలకు సూచించారు. వచ్చే ఆదివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని వెల్లడించారు.

ఢిల్లీలో ధర్నా చేస్తుండగా కేంద్ర బలగాలు దాడి చేశాయని, కేంద్ర ప్రభుత్వ క్రూరత్వానికి ఉద్యమకారులపై జరిగిన దాడే నిదర్శనమని అన్నారు. రూ.3.500 కోట్లు ఇచ్చాం, ఏపీలో ఒక్క ఇటుక కూడా వేయలేదని నాడు అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చలసాని ప్రస్తావించారు.  

Andhra Pradesh
modi
bjp
Prime Minister
chalasani srinivas
  • Loading...

More Telugu News