Tirupati: తిరుపతి రైల్వే స్టేషన్ కు వెళితే... ఫైవ్ స్టార్ హోటల్ అనుభూతి... ఫోటోలు చూడండి!

  • భక్తులకు సర్ ప్రయిజ్
  • 'అతిథి' ప్రీమియమ్ లాంజ్ త్వరలోనే ప్రారంభం
  • ట్విట్టర్ లో వెల్లడించిన పీయుష్ గోయల్

"ఇది రైల్వే స్టేషనా లేక ఐదు నక్షత్రాల హోటలా? తిరుపతికి వచ్చి వెంకన్నను దర్శించుకునే భక్తులకు ఇదో సర్ ప్రయిజ్. 'అతిథి' ప్రీమియమ్ లాంజ్ ని తిరుపతి స్టేషన్ లో అందుబాటులోకి తెచ్చాం. దీన్ని త్వరలోనే ప్రారంభిస్తాం" అని కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్ పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ట్వీట్ లో 'అతిథి'కి సంబంధించిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. ఇక్కడ సౌకర్యవంతమైన రీక్లయినర్ సీట్లు, లగ్జరీగా ఉండే రెస్ట్ రూములు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు చిత్రపటం కూడా ఉంది. కాగా, ఇదే స్టేషన్ లో త్వరలోనే ఓ మల్టీ ప్లెక్స్ కూడా రానుంది.



Tirupati
Railway Station
Five Star
Luxuary
Athithi
Premium Lounge
  • Loading...

More Telugu News