Andhra Pradesh: సంక్రాంతి పండుగ అంటే రైతులు, పల్లెలే గుర్తుకు వస్తాయి!: జగన్

  • తెలుగుప్రజలకు జగన్ శుభాకాంక్షలు
  • సంక్రాంతి ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకని వ్యాఖ్య
  • ట్విట్టర్ లోస్పందించిన వైసీపీ అధినేత

వైసీపీ అధినేత జగన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సొంత గ్రామాలతో ప్రజలకు ఉన్న ఆత్మీయతలు, అనుబంధాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని జగన్ వ్యాఖ్యానించారు. సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెలు గుర్తుకు వస్తాయన్నారు. ఈసారి పంటలు బాగా పండి రైతులు సంతోషంగా, ప్రతీ ఒక్కరి ఇల్లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ అధినేత ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
sankranti
wishes
YSRCP
Jagan
Twitter
  • Loading...

More Telugu News