C/o Kancharapalem: కేటీఆర్ చొరవతో 'కేరాఫ్ కంచరపాలెం' టీమ్ కు ఊరట!

  • తొలుత జాతీయ అవార్డుల పోటీలో నిలిచేందుకు అనుమతించని కేంద్రం
  • రాజ్ వర్ధన్ సింగ్ రాథోడ్ తో మాట్లాడిన కేటీఆర్
  • ఆపై పోటీకి దరఖాస్తు చేసేందుకు అంగీకారం

'కేరాఫ్ కంచరపాలెం'... తక్కువ బడ్జెట్ తో తయారై, సినీ ప్రేక్షకులను మెప్పించిన చిత్రం. గత సంవత్సరం విడుదలైన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా ఉన్న 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రాన్ని ఓ ఎన్నారై నిర్మించారన్న కారణంతో, జాతీయ అవార్డుల బరిలో నిలిచేందుకు అర్హత లేదంటూ అవార్డుల నిర్వాహక కమిటీ ప్రకటించింది.

 ఇక విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్, కేంద్రమంత్రి రాజ్ వర్ధన్ సింగ్ రాథోడ్ తో స్వయంగా మాట్లాడగా, ఈ సినిమాను కూడా పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులు అంగీకరించారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఎండీ పరుచూరి, తమకు సహకరించిన కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిబంధనను శాశ్వతంగా తొలగించేలా చూడాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News