Andhra Pradesh: స్పా సెంటర్ల ముసుగులో ‘థాయ్’ యువతులతో వ్యభిచారం.. విజయవాడలో నిర్వాహకుల అరెస్ట్!

  • దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • ఏడుగురు యువతులు అదుపులోకి 
  • నిర్వాహకులపై కేసు నమోదు చేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈరోజు టాస్క్ ఫోర్స్ అధికారులు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మసాజ్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేశారు. థాయ్ లాండ్ కు చెందిన నలుగురు యువతులతో పాటు ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పోలీసుల దాడిలో విదేశీ యువతులు పట్టుబడటం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించిన అధికారులు స్పా సెంటర్ల నిర్వాహకులపై ఐపీసీ 370(2), ఐటీపీ చట్టంలోని 3,4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దాడులు నిర్వహించడంతో స్పా సెంటర్లకు విటులను తీసుకొస్తున్న మధ్యవర్తి రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతోనే తాము భారత్ కు వచ్చామని థాయ్ లాండ్ యువతులు చెబుతున్నారు.

Andhra Pradesh
Vijayawada
spa
thailand
Police
arrest
  • Loading...

More Telugu News