Kurnool District: శ్రీశైలం వద్ద రోడ్డు ప్రమాదం...లోయలోకి దూసుకువెళ్లిన టూరిస్టు బస్సు

  • బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఘటన
  • బస్సులో 36 మంది ప్రయాణికులు
  • అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడిన బాధితులు

టూరిస్టు బస్సు ఒకటి అదుపుతప్పి లోయలోకి దూసుకువెళ్లిన ఘటనలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. కర్నూల్‌ జిల్లా శ్రీశైలం సమీపంలోని చిన్నారుట్ల వద్ద ఘాట్‌ రోడ్డుపై ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన 36 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి ఘాట్‌ రోడ్డు రక్షణ గోడను ధ్వంసం చేసుకుంటూ లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బ్రేకులు పనిచేయక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్‌ తెలిపాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Kurnool District
srisailam
bus accident
  • Loading...

More Telugu News