Chandrababu: అంత భయమా? ఏం తప్పు చేశావు చంద్రబాబూ?: నరేంద్ర మోదీ

  • సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించిన చంద్రబాబు
  • ఆయన సచ్చీలుడా?
  • బీజేపీ జాతీయ సమావేశంలో మోదీ

"చంద్రబాబు, మమతా బెనర్జీలు తమ రాష్ట్రాల్లోకి సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించారు. అంత భయపడేంత తప్పు వారు ఏం చేశారు? ఇప్పుడు సీబీఐని వద్దంటున్నారు. రేపు మిగతా కేంద్ర సంస్థలను రానీయబోమంటారు. సైన్యం, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, కాగ్‌... ఇలా ప్రతి ఒక్కటీ చంద్రబాబు దృష్టిలో తప్పుడు సంస్థేలేనా? వారు మాత్రమే సచ్ఛీలురా" అని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం వేదికపై ప్రసంగించిన మోదీ, తాను గుజరాత్‌ కు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ, తొమ్మిది గంటలపాటు సిట్‌ కార్యాలయంలో విచారణను ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, "మహా కూటమికి నాయకులుగా ఎవరు ఉంటారు? బెంగాల్‌ దీదీయా?, ఆంధ్రప్రదేశ్‌ బాబూనా?, యూపీ బెహన్‌ జీయా?" అని ప్రశ్నించారు.

Chandrababu
CBI
Narendra Modi
Mamata
Arun Jaitly
  • Loading...

More Telugu News