YSRCP: ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్... వైసీపీలో చేరిన చెన్నకేశవరెడ్డి!

  • పార్టీ కండువాను కప్పిన జగన్
  • జమ్మలమడుగులో పార్టీ బలపడిందన్న వైకాపా అధినేత
  • వైకాపా నుంచి గెలిచి, టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి, ఆపై తెలుగుదేశంలో చేరిన మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్‌ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు చెన్నకేశవరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నిన్న జగన్ కడపకు వచ్చిన వేళ, చెన్నకేశవరెడ్డి జగన్ ను కలువగా, ఆయనకు పార్టీ కండువా కప్పిన జగన్, వైకాపాలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జమ్మలమడుగు ఇన్‌ చార్జి సుధీర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. చెన్నకేశవరెడ్డి చేరికతో జమ్మలమడుగు ప్రాంతంలో వైకాపా మరింతగా బలపడిందని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.

YSRCP
Jagan
Adinarayanareddy
Chennakesavareddy
  • Loading...

More Telugu News