F2: ‘ఎఫ్2’కి వరుణ్ కంటే వెంకీకే ఎక్కువ పారితోషికం ముట్టిందట!

  • సక్సెస్ టాక్‌ను అందుకున్న ‘ఎఫ్2’
  • మెహ్రీన్ కంటే తమన్నా పారితోషికం ఎక్కువ
  • జూనియర్ల కన్నా సీనియర్లకే ఎక్కువ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షోతోనే ఈ చిత్రం మంచి సక్సెస్ టాక్‌ను అందుకుంది. తమన్నా, మెహ్రీన్ కథానాయకలుగా నటించిన ఈ చిత్రానికి ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే దానిపై ప్రేక్షకుల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

అయితే సినిమా విషయంలో మాత్రం జూనియర్ల కన్నా సీనియర్లే ఎక్కువ మొత్తం పొందారట. ఈ చిత్రానికి వెంకీ రూ.5 కోట్ల పారితోషికం తీసుకోగా.. వరుణ్ రూ.3.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్టు చెబుతున్నారు. ఇక తమన్నా, మెహ్రీన్‌ల విషయానికి వస్తే.. ఎంత తీసుకున్నారన్న విషయమైతే వెలుగులోకి రాలేదు కానీ.. మెహ్రీన్ కంటే మాత్రం తమన్నాయే ఎక్కువ పారితోషికం తీసుకుందని సమాచారం.

F2
Anil Ravipudi
Venkatesh
Varun Tej
Tamannah
Mehreen
  • Loading...

More Telugu News