india: త్వరలోనే నాలుగు కొత్త నాణేలను విడుదల చేయనున్న కేంద్రం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-1c96a3d9c42226a4d0280472b06fc058da7d9533.jpg)
- మార్కెట్లోకి రానున్న రూ. 1, 2 , 10, 20 విలువైన నాణేలు
- ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ
- ఈ నెల 16న అధికారుల సమావేశంలో నమూనాల ఖరారు
మార్కెట్లోకి నాలుగు కొత్త నాణేలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేయబోతోంది. ఈ మేరకు ఆ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ నెల 16న ఢిల్లీలోని జవహర్ వ్యాపార్ భవన్ లో అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా రూ. 1, రూ. 2, రూ, 10, రూ. 20ల విలువైన కొత్త సిరీస్ నాణేల నమూనాలను ప్రదర్శిస్తారు. అనంతరం నాణేల నమూనాలను ఖరారు చేస్తారు. సమావేశం సందర్భంగా నాణేలలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అధికారులు వారి అభిప్రాయాలను తమకు తెలియజేయవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది.