YSRCP: కాకినాడలో భోగి మంటల ప్రమాదం.. వైసీపీ నేత కన్నబాబు తండ్రి పంచెకు అంటుకున్న మంటలు!

  • కాకినాడలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
  • మంటలు అంటుకోవడంతో కన్నబాబు తండ్రికి తీవ్ర గాయాలు
  • హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అచ్చంపేట జంక్షన్ లో సంబరాలు జరిగాయి. భోగి మంటలను వెలిగిస్తున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తండ్రి పంచెకు నిప్పంటుకుంది. పక్కనున్న వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ లోగానే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆయనను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం.

YSRCP
kanna babu
father
Fire Accident
  • Loading...

More Telugu News