jagat singh: నాపై రాళ్లు విసిరేవారికి ఏకే47తో సమాధానం చెబుతా: కలకలం రేపుతున్న బీఎస్పీ నేత వ్యాఖ్యలు

  • రాంగఢ్ లో నిర్వహించిన ర్యాలీలో జగత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
  • ఆలస్యంగా వెలుగు చూసిన వీడియో
  • కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ కుమారుడే జగన్ సింగ్

తన ప్రత్యర్థులకు ఏకే47తో సమాధానం చెబుతానంటూ రాజస్థాన్ బీఎస్పీ నేత జగత్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాంగఢ్ లో ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచలనం రేపుతోంది.

 తన మద్దతుదారులను ఉద్దేశించి జగత్ సింగ్ మాట్లాడుతూ 'నేను వెనక్కి పారిపోను. ఎవరైనా మీ మీద కాల్పులు జరిపితే... తొలి బుల్లెట్ నా గుండెల్లోకే దిగుతుంది. నాపై రాళ్లు విసిరే వారికి ఏకే47తో సమాధానం చెబుతా. మోదీ, అశోగ్ గెహ్లాట్, వసుంధరా రాజే ఎవరైనా సరే... ఇక్కడి నుంచి బయటకు పంపించేస్తా' అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ కుమారుడే జగత్ సింగ్ కావడం గమనార్హం.

jagat singh
ak 47
bsp
  • Loading...

More Telugu News