Andhra Pradesh: ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.. ఏయే జిల్లాలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..!

  • రాష్టంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091
  • పురుష ఓటర్ల సంఖ్య 1,83,24,588
  • మహిళా ఓటర్ల సంఖ్య 1,86,04,742

ఏపీలోని ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. రాష్టంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 అని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. ఇందులో 1,83,24,588 మంది పురుష ఓటర్లు కాగా... 1,86,04,742 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్లు 3,761 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉండగా... విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు.

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య ఇదే:

  • శ్రీకాకుళం - 20,64,330
  • విజయనగరం - 17,33,667
  • విశాఖపట్నం - 32,80,028
  • తూర్పుగోదావరి - 40,13,770
  • పశ్చిమగోదావరి - 30,57,922
  • కృష్ణా - 33,03,592
  • గుంటూరు - 37,46,072
  • ప్రకాశం - 24,95,383
  • నెల్లూరు - 22,06,652
  • కడప - 20,56,660
  • కర్నూలు - 28,90,884
  • అనంతపురం - 30,58,909
  • చిత్తూరు 30,25,222

Andhra Pradesh
ap
voter
list
number
ec
  • Loading...

More Telugu News