Andhra Pradesh: ఆ పుస్తకాన్ని జగన్ భోగి మంటల్లో వేసుకోవాల్సిందే!: మంత్రి నక్కా ఎద్దేవా

  • బడ్జెట్-జగన్ లెక్కలకు పొంతన లేదు
  • దమ్ముంటే జగన్ కేంద్రంపై పోరాడాలి
  • గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి 

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు, జగన్ చెబుతున్న అవినీతి లెక్కలకు సంబంధం లేదని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. తాము అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని అచ్చువేస్తే.. దానికి కౌంటర్ గా జగన్ ఇప్పుడు చంద్రబాబుపై ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నక్కా ఆనంద్ బాబు మాట్లాడారు.

వైసీపీ అధినేత జగన్ తాను అచ్చువేసిన పుస్తకాన్ని భోగి మంటల్లో వేసుకోవాల్సిందేనని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలనీ, లేకపోతే తమతో పోరాటానికి కలిసి రావాలని మంత్రి ఆనంద్ బాబు సవాల్ విసిరారు. 

Andhra Pradesh
Jagan
nakka
anand babu
YSRCP
Telugudesam
book
  • Loading...

More Telugu News