Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలను ప్రకటించిన మంత్రి గంటా!
- ఈ ఏడాది ఏప్రిల్ 19న ఏపీ-ఈసెట్
- పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహణ
- ఏప్రిల్ 20న ఎంసెట్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్)కు నగారా మోగింది. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడుతూ.. 2019 ఏప్రిల్ 19న అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ నిర్వహిస్తామని తెలిపారు.
అలాగే ఏప్రిల్ 20న ఏపీ ఎంసెట్(కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో), ఏప్రిల్ 26న ఐసెట్(ఎస్వీయూ ఆధ్వర్యంలో), మే 1 నుంచి ఏపీ పీజీసెట్ (ఏయూ ఆధ్వర్యంలో), మే 6న ఏపీ ఎడ్‌సెట్(ఎస్వీయూ ఆధ్వర్యంలో), మే 6న ఏపీ లా సెట్(ఎస్కేయూ ఆధ్వర్యంలో), మే 5 నుంచి ఏపీ పీఈ సెట్ (నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో) నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తామని మంత్రి అన్నారు. గత రెండేళ్లుగా ఆన్ లైన్ లోనే ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని గంటా గుర్తుచేశారు.