Telangana: తెలంగాణకు ‘పంచాయతీ’ కళ.. నేడు సిద్ధిపేట, సిరిసిల్ల, జగిత్యాలలో ఎన్నికల కమిషనర్ పర్యటన!

  • కలెక్టర్లు, ఎస్పీలతో నాగిరెడ్డి భేటీ
  • సమస్యాత్మక ప్రాంతాలు, చర్యలపై చర్చ
  • పంచాయతీ ఎన్నికల అధికారులతో సమావేశం

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏర్పాట్లను పూర్తిచేసేందుకు ఎన్నికల సంఘం జోరును పెంచింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఈరోజు  సిద్ధిపేట, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ ఎన్నికల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై చర్చించనున్నారు. కాగా, ఈసారి ఏకగ్రీవం అయిన పంచాయతీల వివరాలను ఆయన తెలుసుకుంటారు.  

Telangana
panchayat elections
Siddipet District
Rajanna Sircilla District
Jagtial District
  • Loading...

More Telugu News