vadnagar: నేను ‘హిందీ’ అలా నేర్చుకున్నా: ప్రధాని మోదీ

  • మా తండ్రికి ఓ టీస్టాల్ ఉండేది
  • నేను మా నాన్నకు సాయంగా ఉండేవాడిని
  • అక్కడికొచ్చే వాళ్లు చెప్పే హిందీ మాటలు వినేవాడిని 

ప్రధాని మోదీ తన చిన్నతనం నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఎంతో ఆసక్తి గొలుపుతున్న ఈ విషయాల గురించి తాజాగా మోదీ ప్రస్తావించారు. ‘హ్యుమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్ బుక్ పేజ్ నిర్వాహకులతో ఆయన ముచ్చటించారు. తాను హిందీ భాషను ఏ విధంగా నేర్చుకున్నారో ఈ సందర్భంగా మోదీ చెప్పారు.

వాద్ నగర్ లోని రైల్వేస్టేషన్ లో తన తండ్రికి టీస్టాల్ ఉండేదని, ఉదయాన్నే లేచి తాను అక్కడికి వెళ్లి దాన్ని శుభ్రం చేసేవాడినని చెప్పారు. ఆ తర్వాత, పాఠశాలకు వెళ్లిపోయేవాడినని గుర్తుచేసుకున్నారు. పాఠశాల ముగిసిన అనంతరం, తిరిగి టీ స్టాల్ కు వెళ్లిపోయి తన తండ్రికి సాయంగా ఉండేవాడినని అన్నారు. తమ టీ స్టాల్ వద్దకు ఎంతో మంది వస్తుండే వారని, వాళ్లకి టీ అందిస్తూ, వాళ్లు చెప్పే హిందీ మాటలను వినడం ద్వారా ఆ భాషను నేర్చుకున్నానని మోదీ చెప్పారు.

vadnagar
Gujarath
pm
modi
railway station
Tea stall
hindi
language
  • Loading...

More Telugu News