Amarnath Reddy: చంద్రబాబుపై పవన్ ఏనాడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: మంత్రి అమర్‌నాథ్ రెడ్డి

  • పవన్ విషయమై సానుకూల వ్యాఖ్యలు
  • పవన్ మాతో కలిస్తే జగన్‌కు బాధేంటి?
  • మా పార్టీతో కలిస్తే బాగుంటుంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విషయమై మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సానుకూల వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పవన్ తమతో కలిస్తే వైఎస్ జగన్‌కు బాధేంటని ప్రశ్నించిన సంగతి విదితమే. ఇదే విషయంపై నేడు మంత్రి మాట్లాడుతూ, పవన్ తమ పార్టీతో కలిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. నేడు అమర్‌నాథ్ రెడ్డి చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై పవన్ ఏనాడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పవన్ తమ పార్టీతో కలిస్తే మంచిదేనని వ్యాఖ్యానించారు.

Amarnath Reddy
Pavan kalyan
Janasena
Jagan
Chandrababu
  • Loading...

More Telugu News