Andhra Pradesh: రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీకి సినిమా చూపిస్తాం: మంత్రి నారా లోకేశ్

  • ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ లపై లోకేశ్ ధ్వజం
  • కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమే
  • అసలు సినిమాను ఏపీలో బీజేపీకి చూపిస్తాం

ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమాను, రాబోయే రోజుల్లో ఏపీలో పూర్తి స్థాయిలో చూపిస్తామని లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానిలా కాకుండా ఓ చక్రవర్తిలా మోదీ వ్యవహరిస్తున్నారని, సీబీఐ, ఆర్బీఐ లాంటి వ్యవస్థలను ఆయన భ్రష్టుపట్టించారని విమర్శించారు. ప్రత్యేకహోదాపై ఏనాడైనా మోదీని జగన్ విమర్శించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిని మోదీ, జగన్ లు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏపీ బీజేపీ నేతలకు దమ్ముంటే ఏపీ సమస్యలపై మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
BJP
Telugudesam
Nara Lokesh
Modi
YSRCP
Ys jagan
cbi
Rbi
  • Loading...

More Telugu News