alok varma: సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ సంచలన నిర్ణయం.. ఉద్యోగానికి రాజీనామా

  • సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి నిన్న వర్మను తొలగించిన కేంద్రం
  • ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ
  • మనస్తాపంతో సర్వీసెస్ కు రాజీనామా చేసిన వర్మ

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఫైర్ సర్వీసెస్ చీఫ్ గా బాధ్యతలను తీసుకోవడానికి నిరాకరించిన ఆయన... ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం నాడు మరోసారి సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలను చేపట్టిన వర్మను... నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం మళ్లీ తప్పించిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేసింది. దీంతో అలోక్ వర్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను ఎలాంటి తప్పులు చేయకపోయినా... ఎవరో చేసిన ఆరోపణలకు తనను బలిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

alok varma
cbi
resign
  • Loading...

More Telugu News