Madhya Pradesh: ముఖ్యమంత్రిని ‘బందిపోటు దొంగ’ అన్న హెడ్మాస్టర్.. కొరడా ఝుళిపించిన కలెక్టర్!

  • మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ భరద్వాజ్

ప్రభుత్వ ఉద్యోగులు అన్నాక కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అసలు ఉద్యోగానికే ఎసరు వస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను అక్కడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ ‘దోపిడి దొంగ’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు టీచర్ పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని కాంగ్రెస్ చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో జబల్పూర్‌‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ముకేశ్ తివారీ అనే హెడ్మాస్టర్ మాట్లాడుతూ..‘కమల్ నాథ్ ఓ బందిపోటు దొంగ’ అని చెప్పారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ చావి భరద్వాజ్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నేపథ్యంలో టీచర్ ముకేశ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.

Madhya Pradesh
Chief Minister
daku
head master
jabalpur
collector
suspended
  • Loading...

More Telugu News