NTR biopic: 'కథానాయకుడి'లో బాలయ్య నటన అద్భుతం: సీఎం చంద్రబాబు

  • డైరెక్టర్‌ క్రిష్‌ దర్శక పటిమ అభినందనీయం
  • ఇద్దరూ కలిసి ఎన్టీఆర్‌ జీవితాన్ని చక్కగా ఆవిష్కరించారు
  • ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపం ఇచ్చారు

ఎన్టీఆర్‌ బయోపిక్‌ తొలిభాగం ‘కథానాయకుడు’లో నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారని, క్రిష్‌ దర్శక పటిమ అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లు చంద్రబాబును కలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం దర్శకనటులిద్దరినీ సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారని, క్రిష్‌ మంచి చిత్రరూపం ఇచ్చారని కితాబునిచ్చారు. ఎన్టీఆర్‌ జీవితాన్ని, కార్యదక్షతను, త్యాగాన్ని ప్రజలకు అర్థమయ్యే రూపంలో చిత్ర రూపం ఇచ్చారని ఇద్దరినీ ప్రశంసించారు.

NTR biopic
krish
Balakrishna
Chandrababu
  • Loading...

More Telugu News