Telangana: కాంగ్రెస్ కంచుకోటలో టీఆర్ఎస్ పాగా.. సోములగూడెంలో తొలిసారి గెలవబోతున్న పార్టీ!

  • భధ్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో ఘటన
  • కాంగ్రెస్ కు అభ్యర్థులు సైతం దొరకని వైనం
  • టీఆర్ఎస్ వశం కానున్న సోములగూడెం

తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఇక్కడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం సోములగూడెం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచింది. దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే సర్పంచ్ గా విజయం సాధిస్తూ వస్తున్నారు.

అయితే తాజాగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. నామినేషన్ల గడువు ముగిసేలోపు సర్పంచ్ పదవికి కేవలం రెండే నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీరిలో అధికార టీఆర్ఎస్ కు చెందిన వ్యక్తి ఒకరు కాగా, మరో డమ్మీ అభ్యర్థి ఉన్నారు. దీంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో టీఆర్ఎస్ పాగా వేయబోతోంది. 

Telangana
Bhadradri Kothagudem District
somulagudem
panchayat elections
TRS
Congress
  • Loading...

More Telugu News