gvl narasimharao: అలోక్ వర్మ కంటే రాహుల్ గాంధీనే ఎక్కువ ఏడుస్తున్నారు: జీవీఎల్ సెటైర్

  • అగస్టాతో పాటు పలు రక్షణ ఒప్పందాల కేసులను సీబీఐ విచారిస్తోంది
  • నిజాలు వెలుగులోకి వస్తాయని కాంగ్రెస్ భయపడుతోంది
  • అందుకే సీబీఐ వ్యవహారాల్లోకి తలదూర్చాలని చూస్తోంది

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎం.నాగేశ్వరరావుకు సీబీఐ పగ్గాలను అప్పగించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ విమర్శలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విరుచుకుపడ్డారు.

'సీబీఐ విషయంలో అలోక్ వర్మ కంటే రాహుల్ గాంధీనే ఎక్కువ ఏడుస్తున్నారు. అగస్టా వెస్ట్ లాండ్ తో పాటు ఇతర రక్షణ ఒప్పందాల కేసులను ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. నిజాలు వెలుగులోకి వస్తాయని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. అందుకే సీబీఐ వ్యవహారాల్లోకి తలదూర్చాలని చూస్తోంది' అంటూ ట్వీట్ చేశారు.

gvl narasimharao
Rahul Gandhi
alok varma
cbi
congress
bjp
  • Loading...

More Telugu News