Rahul Gandhi: అబ్బే.. రాహుల్ గాంధీ అలాంటి వారు కాదు!: సుశీల్ కుమార్ షిండే

  • నిర్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌కు నోటీసులు
  • రాహుల్‌కు మహిళలంటే గౌరవమన్న షిండే
  • పార్టీ కోసం జీవితాంతం పనిచేస్తానన్న మాజీ సీఎం

రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే అండగా నిలిచారు. రాహుల్‌కు మహిళలంటే ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ర్యాలీల్లోనూ స్త్రీలను గౌరవించి మాట్లాడుతుంటారని గుర్తు చేశారు.

కేంద్రమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. రాహుల్‌కు నోటీసులపై షిండే మాట్లాడుతూ.. రాహుల్ మహిళలను అవమానించే వ్యక్తి కాదన్నారు. మహిళలంటే ఆయనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ర్యాలీలు, బహిరంగ సభల్లోనూ వారికి ఎంతో గౌరవం ఇస్తారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేదంటే పార్టీ కోసం జీవితాంతం పనిచేస్తానని షిండే చెప్పుకొచ్చారు.

Rahul Gandhi
Sushil Kumar Shinde
Congress
Nirmala Sitharaman
  • Loading...

More Telugu News