Chandrababu: చిన్నపిల్లాడిలా చంద్రబాబు.. పిల్లలతో కలిసి ఉత్సాహంగా గోళీలాట!

  • ప్రకాశం జిల్లా కందుకూరులో సీఎం పర్యటన
  • కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టులకు శంకుస్థాపన
  • పిల్లలతో పలు ఆటలు ఆడిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చిన్నపిల్లాడైపోయారు. గోళీలాడుతున్న పిల్లలను చూసిన సీఎం ఆగలేకపోయారు. చిన్నపిల్లాడిలా వారితో కలిసి గోళీలాడారు. అలాగే, కర్రాబిళ్ళా, వాలీబాల్, కోలాటం ఆడుతూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టులకు శంకుస్థాపన చేసి పైలాన్లను ఆవిష్కరించారు. అనంతరం జన్మభూమి, మావూరు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు, పిల్లల ఆటల పోటీలను  సందర్శించారు. చిన్నారులు గోళీలు, కర్రాబిళ్ళా ఆడుతుండడం చూసి చంద్రబాబు కూడా వారితో చేరారు. కాసేపు ఆడి చిన్నారులను ఉత్సాహపరిచారు.

Chandrababu
Andhra Pradesh
Prakasam District
Kandukuru
children
  • Loading...

More Telugu News