Pawan Kalyan: నాకు ఎంతో గౌరవమిచ్చిన పవన్ కల్యాణ్ పై కామెంట్ చేయలేను: ఉండవల్లి అరుణ్ కుమార్

  • నాటి మీటింగ్ లో అందరూ ఐఏఎస్ అధికారులే  
  • ఆ మీటింగ్ కి హాజరైన ఒకే ఒక్క పొలిటీషియన్ని నేను
  • అది పవన్ నాకిచ్చిన అపారమైన గౌరవం

నాడు తాను నిర్వహించిన మీటింగ్ కు అందర్నీ ఐఏఎస్ అధికారులను పిలిచిన పవన్ కల్యాణ్, ఒకే ఒక్క పొలిటీయన్ గా తనని మాత్రమే ఆహ్వానించిన విషయాన్ని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అంతకుముందు పవన్ కల్యాణ్ తో తనకు పరిచయం కానీ, ఆయనకు తనకు కామన్ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరని చెప్పారు. ఇలా, ఆ మీటింగ్ కి ఆహ్వానించడాన్ని తనకిచ్చిన అపారమైన గౌరవంగా భావించానని, ఈరోజుకి కూడా పవన్ కల్యాణ్ ని తానేమీ అనలేనని, తానేమీ కామెంట్ చేయలేనని అన్నారు. అలా కామెంట్ చేయలేకపోవడాన్ని తన వీక్ నెస్ లేదా పక్షపాతం అనుకోండి అని చెప్పుకొచ్చారు. అయితే, పవన్ కల్యాణ్ అధికారంలోకొస్తే మాత్రం ఆయనపై కామెంట్స్ చేస్తానని ఉండవల్లి చెప్పడం కొసమెరుపు.

Pawan Kalyan
jana sena
Undavalli
  • Loading...

More Telugu News