జగన్ ని విమర్శించేందుకు చంద్రబాబు వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధమిది!: ఉండవల్లి అరుణ్ కుమార్
- జగన్ పై అవినీతి ఆరోపణల కేసులు ఉన్నాయి
- కోర్టు చుట్టూ తిరుగుతున్నారు
- ఇదే చంద్రబాబు వద్ద ఉన్న ఆయుధం
ఏదేమైనప్పటికీ, జగన్ పై ఉన్న అవినీతి ఆరోపణల కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటివన్నీ కూడా ఆయనకు మైనస్ పాయింట్లేనని అన్నారు. అయితే, జగన్ పై ఆరోపించిన అవినీతి కేసుల్లో సత్తా లేదని, ఈ ఆరోపణలన్నీ చాలా పేలవమైనవని, మన దేశంలో ‘క్విడ్ ప్రో కో’కు సంబంధించి నిలబడ్డ కేసులు లేవని అన్నారు. జగన్ ఫలానా వ్యక్తితో, ఐఏఎస్ అధికారితో మాట్లాడారన్న విషయాలను ఛార్జిషీట్ లో ఎక్కడా పెట్టలేదని, తన ఉద్దేశంలో అయితే ఈ కేసులేవీ నిలబడేవి కాదని అన్నారు.