ys rajashekar reddy: వాళ్లిద్దరి కన్నా జగన్ పాదయాత్రకు ఎక్కువ స్పందన వచ్చింది: ఉండవల్లి అరుణ్ కుమార్

  • జగన్ పాదయాత్ర విజయవంతమైంది
  • జగన్ కు ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది
  • మోదీని విలన్ గా చూపించడంలో బాబు సక్సెస్  

జగన్ పాదయాత్ర విజయవంతమైందని ప్రముఖ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ పాదయాత్రతో జగన్ కు ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులు చేసిన పాదయాత్రల కన్నా జగన్ ప్రజా సంకల్పయాత్రకు ప్రజల్లో ఎక్కువ స్పందన వచ్చిందని అభిప్రాయపడ్డారు.

2014లో మోదీ, పవన్ ప్రభావాలు చంద్రబాబుకు బాగా కలిసొచ్చాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కు చంద్రబాబు ఒప్పుకుంటారని అనుకోలేదని, ప్యాకేజ్ ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి అభినందించారని, ఇప్పుడేమో, ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తానేమీ చేయలేని చోట మోదీని విలన్ గా చూపించడంలో సక్సెస్ అయ్యారని ఎద్దేవా చేశారు.

ys rajashekar reddy
jagan
Chandrababu
Undavalli
  • Loading...

More Telugu News