YSRCP: ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా చంద్రబాబు ఓవర్ యాక్షన్ చేస్తారు: ఎమ్మెల్యే రోజా

  • ప్రజలు ముట్టుకుంటే విసుక్కుంటారు
  • నోట్లో కేక్ పెట్టినప్పుడు బాబు పక్కకు తోసేస్తారు 
  • జగన్ మాత్రం సామాన్య మనిషిలా ప్రవర్తిస్తారు

వైఎస్ జగన్ ఎప్పుడూ ఒదిగి ఉండే వ్యక్తేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా కొనియాడారు. తిరుమలలో జగన్ కు స్వాగతం పలికేందుకు అక్కడికి చేరుకున్న ఆమెను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ప్రజలు ఎవరైనా తనను ముట్టుకుంటే చంద్రబాబునాయుడు విసుక్కుంటారని, ఎవరైనా ఆయన నోట్లో కేక్ పెట్టినప్పుడు పక్కకు తోసేస్తారని, ఇలాంటి పనులు జగన్ చేయరని అన్నారు. ఏదో ఆకాశం నుంచి లేదా అమెరికా నుంచి ఊడిపడ్డట్టుగా బాబు ఓవర్ యాక్షన్ చేస్తారని విమర్శించారు. కానీ, బంగారు ఉయ్యాల్లో పుట్టి, బంగారు కంచంలో తిన్న జగన్ మాత్రం సామాన్య మనిషిలా, ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని అన్నారు. 

YSRCP
Jagan
mla
roja
Tirumala
  • Loading...

More Telugu News