EBC: ఈబీసీలకు రిజర్వేషన్ల బిల్లుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన యూత్ ఫర్ ఈక్విటీ సంస్థ
- ఈ బిల్లు ద్వారా రిజర్వేషన్లు 50 శాతం దాటాయి
- ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు
ఈబీసీలకు రిజర్వేషన్ల బిల్లుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ యూత్ ఫర్ ఈక్విటీ సంస్థ ఈ పిల్ ను దాఖలు చేసింది. ఈ బిల్లు ద్వారా దేశంలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆ పిటిషన్ లో పేర్కొంది.
కాగా, ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలూ ఆమోదం తెలిపాయి. ఈబీసీ రిజర్వేషన్ వల్ల బ్రాహ్మణులు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, రాజ్ పుత్ లు, జాట్స్, మరాఠాలు, భూమిహార్ వంటి సామాజిక వర్గాల పేద ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.