Andhra Pradesh: అమరావతిలో ‘వెల్‌కమ్ గ్యాలరీ’కి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది: సీఎం చంద్రబాబు

  • రాజధాని అమరావతిలో ‘వెల్‌కమ్ గ్యాలరీ’ 
  • సింగపూర్ మంత్రి ఈశ్వరన్,బాబు కలిసి శంకుస్థాపన
  • నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా: చంద్రబాబు

రాజధాని అమరావతిలో ‘వెల్‌కమ్ గ్యాలరీ’కి శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. స్టార్టప్ ఏరియా ఫేస్-1 దగ్గర ‘వెల్ కమ్ గ్యాలరీ’కి సింగపూర్ మంత్రి ఈశ్వరన్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వ సహకారం మరువలేనిదని ప్రశంసించారు.

 సింగపూర్ తరహాలో రాజధానిని అభివృద్ధి చేస్తానన్న మాటను నిలబెట్టుకుంటున్నానని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్,  పరిపాలనా వ్యవహారాల్లో సింగపూర్ సహకారం అందిస్తోందని అన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నైపుణ్యంలో సింగపూర్ సహకరిస్తోందని, రాజధానిలో నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ-ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు ద్వారా మంచి పాలన అందిస్తున్నామని, దాదాపు కోటిన్నర ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించినట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు. 

Andhra Pradesh
amaravathi
Chandrababu
singapore
Eswaran
welcogme gallery
RGt
  • Loading...

More Telugu News