Google: 'ఈజీ యూనివర్సల్ టీవీ రిమోట్' సహా 85 యాప్స్ ను తొలగించిన ప్లే స్టోర్!

  • స్మార్ట్ ఫోన్ల డేటాకు హాని
  • యాడ్ వేర్ కేటగిరీలో ఉన్న యాప్స్
  • 90 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారన్న గూగుల్

స్మార్ట్ ఫోన్లలో డేటాకు హాని కలిగిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మొత్తం 85 యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు గూగుల్ పేర్కొంది. వీటిల్లో దాదాపు 50 లక్షలకు పైగా డౌన్ లోడ్లను పొందిన 'ఈజీ యూనివర్సల్ టీవీ రిమోట్' కూడా ఉండటం గమనార్హం. గేమ్, టీవీ, రిమోట్ కంట్రోల్ సిమ్యులేటర్ కేటగిరీలో యాడ్ వేర్ కలిగుండే యాప్స్ వల్ల సెల్ ఫోన్లలోని డేటా తస్కరించబడుతోందని గూగుల్ పేర్కొంది.

ఈ యాడ్ వేర్ ద్వారా ప్రకటనలు ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తుంటాయని, యాప్‌లు మొబైల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లో పని చేస్తుంటాయని తెలిపింది. దాదాపు 90 లక్షల మందికి పైగా వీటిని డౌన్ లోడ్ చేసుకున్నారని, ఇవి మొబైల్‌ స్క్రీన్‌ అన్‌ లాకింగ్‌ యాక్షన్‌ ను తమ అధీనంలోకి తీసుకుని, ఫోన్‌ ను లాక్‌ చేసిన ప్రతిసారీ ప్రకటనలు చూపిస్తుంటాయని వెల్లడించింది. కాగా, తొలగించబడిన యాప్స్ లో స్పోర్ట్‌ టీవీ, టీవీ రిమోట్‌, ఏసీ రిమోట్‌, లవ్‌ స్టికర్‌, రిమోట్‌ కంట్రోల్‌, పార్కింగ్‌ గేమ్‌, వరల్డ్‌ టీవీ తదితరాలున్నాయి.

  • Loading...

More Telugu News