achennaidu: వాహనంపై పడ్డ వైసీపీ హోర్డింగ్.. అచ్చెన్నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం

  • ఇచ్ఛాపురంలో బైక్ ర్యాలీని నిర్వహించిన టీడీపీ శ్రేణులు
  • మంత్రి ఎస్కార్ట్ వాహనంపై పడ్డ వైసీపీ హోర్డింగ్
  • నలుగురు కార్యకర్తలకు గాయాలు

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇచ్ఛాపురంలో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీని నిర్వహించాయి. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ఎస్కార్ట్ వాహనంపై వైసీపీ హోర్డింగ్ బోర్డు పడింది. ఈ ఘటనలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. అయితే, అచ్చెన్నాయుడికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు సోంపేట మండలం కొర్లాం నుంచి ఇచ్ఛాపురం వరకు టీడీపీ బైక్ ర్యాలీని అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. 

achennaidu
rammohan naidu
Telugudesam
accident
  • Loading...

More Telugu News