Australia: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ.. తొలి వన్డేకు దూరమైన ఆల్ రౌండర్

  • శనివారం సిడ్నీ వేదికగా తొలి వన్డే
  • జట్టుకు దూరమైన ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్
  • జీర్ణాశయ సమస్యలతో చికిత్స పొందుతున్న మార్ష్

ఆస్ట్రేలియా-భారత్ ల మధ్య మూడు వన్డేల సిరీస్ శనివారం ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన ఆస్ట్రేలియా... వన్డే సిరీస్ లో సత్తా చాటి పరువు కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది.

అయితే, వన్డే సిరీస్ కు ముందే ఆసీస్ కు ఎదురు దెబ్బ తగిలింది. తొలి వన్డేకు స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. జీర్ణాశయ సమస్యతో బాధపడుతున్న మార్ష్ తొలి వన్డేలో ఆడటం లేదని కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. ప్రస్తుతం మిచెల్ మార్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని... చివరి రెండు వన్డేలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. మిచెల్ స్థానంలో ఆస్టాన్ టర్నర్ ను జట్టులోకి తీసుకున్నామని వెల్లడించాడు. 

Australia
india
odi
sydney
mitchel marsh
  • Loading...

More Telugu News