Maharashtra: ఒక బంతికి ఆరు పరుగులు చేస్తే గెలుపు... చివరికి ఒక బంతి మిగిలుండగానే విజయం... ఎలా జరిగిందో చూడండి!
- దేశాయ్, జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్
- వరుసగా ఆరు వైడ్ బాల్స్ వేసిన బౌలర్
- వైరల్ అవుతున్న వీడియో
ఒక బంతికి ఆరు పరుగులు చేస్తే గెలుపు వరిస్తుంది. ఈ సమయంలో క్రీజులో ఉన్న ఆటగాడు సిక్స్ కొడితే గెలుస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సమయంలోనూ ఒక నో బాల్ వేస్తే... తరువాతి బంతికి సిక్స్ కొట్టినా విజయం సొంతమవుతుంది. ఆ ఒక్క బాల్ కూడా మిగిలుండగానే విజయం సాధ్యమైందంటే.. ఎలాగో తెలియాలంటే, ఈ కింద ఉన్న వీడియోను చూడాల్సిందే.
మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న ఆదర్శ్ క్రికెట్ క్లబ్ నిర్వహించిన పోటీల్లో భాగంగా దేశాయ్, జుని డోంబివ్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఇది. జుని జట్టుపై గెలవడానికి దేశాయ్ కి ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సివచ్చాయి. ఈ సమయంలో బౌలర్ వరుసగా ఆరు వైడ్ బాల్స్ వేశాడు. దీంతో ఆ జట్టు మరో బంతి మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.
6 runs needed off 1 ball and the team scored it with 1 ball to spare pic.twitter.com/XOehccVBzA
— Amit A (@Amit_smiling) January 8, 2019