Chandrababu: నిన్న ఒక్క రోజే రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి!: చంద్రబాబు

  • అమెరికాలోని వర్జీనియాకు దీటుగా విశాఖ మారుతుంది 
  • లక్షా 26 వేల ఉద్యోగాలను కల్పించే పరిశ్రమలు రానున్నాయి
  • ప్రకాశం జిల్లాకు రూ. 24,500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి 

అమెరికాలోని వర్జీనియా నగరానికి దీటుగా విశాఖపట్నం మారుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి 9వ రోజుపై ఈరోజు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న ఒక్క రోజే రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రానికి లక్షా 26 వేల ఉద్యోగాలను కల్పించే పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. విశాఖ నగరానికి డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు రానున్నాయని చెప్పారు.

లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ రూపాంతరం చెందనుందని చంద్రబాబు అన్నారు. భావనపాడు పోర్ట్, రామాయపట్నం పోర్టులు రానున్నాయని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. ప్రకాశం జిల్లాకు రూ. 24,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్స్ ద్వారా ప్రత్యక్షంగా 4,500 మందికి, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి దొరకబోతోందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 50 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఇళ్ల కోసం భారీ ఎత్తున అర్జీలు వచ్చాయని... త్వరితగతిన వీటన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News