vijay devarakonda: విజయ్ దేవరకొండకి హీరోయిన్ దొరికేసింది

  • సెట్స్ పై 'డియర్ కామ్రేడ్' 
  • నెక్స్ట్ మూవీ క్రాంతిమాధవ్ తో 
  • వచ్చేనెల నుంచి షూటింగ్  

ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత క్రాంతిమాధవ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు. 'ఓనమాలు' .. 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు'తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న క్రాంతిమాధవ్, తన తదుపరి సినిమాలో కథానాయకుడిగా విజయ్ దేవరకొండను ఎంపిక చేసుకున్నాడు.

 కేఎస్ రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించారు. చివరికి కేథరిన్ ను ఎంచుకున్నారనేది తాజా సమాచారం. గ్లామర్ పరంగా తెలుగులో మంచి మార్కులు కొట్టేసిన కేథరిన్, 'నేనే రాజు నేనే మంత్రి' తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. క్రాంతిమాధవ్ మూవీలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం.

vijay devarakonda
catherine
  • Loading...

More Telugu News