ayyappa: పెద్దపాదం మార్గంలో ఏనుగు దాడి.. పరుగెత్తలేక ప్రాణాలు కోల్పోయిన అయ్యప్ప భక్తుడు

  • కుమారుడు, మరో 13 మందితో కలసి పంబకు వెళ్తున్న పరమశివం
  • అర్ధరాత్రి వీరిపై ఏనుగు దాడి
  • కొడుకును భుజాన మోస్తూ పరుగెత్తలేకపోయిన పరమశివం

శబరిమల యాత్ర సందర్భంగా విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఏనుగు చేసిన దాడిలో అయ్యప్ప భక్తుడు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే, 35 ఏళ్ల పరమశివం అనే భక్తుడు తన ఏడేళ్ల కుమారుడు, మరో 13 మందితో కలసి శబరిమల వెళ్తున్నారు. ఎరుమేలి నుంచి పంబకు పెద్దపాదం మార్గం గుండా వెళ్తుండగా... రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఓ ఏనుగు దాడి చేసింది. అందరూ పారిపోగా, పరమశివం మాత్రం పరుగెత్తలేక పోయారు. కొడుకును భుజంపై మోస్తుండటంతో... అతను వేగంగా కదల్లేక పోయాడు. ఈ క్రమంలో ఆయనపై గజరాజు దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... ఆయన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

ayyappa
devotee
elephant
attack
sabarimala
  • Loading...

More Telugu News