kannada: కన్నడ స్టార్ హీరో యశ్ ఇంటి ముందు నిప్పంటించుకున్న అభిమాని.. ఆసుపత్రిలో మృతి

  • జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు యశ్ నివాసానికి వెళ్లిన రవి
  • మాట్లాడేందుకు నిరాకరించిన యశ్
  • మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యశ్

తనకు మాట్లాడే అవకాశం కల్పించలేదనే ఆవేదనతో కన్నడ స్టార్ హీరో యశ్ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలోని పావగడ ప్రాంతానికి చెందిన రవి (28) యశ్ కు వీరాభిమాని. బెంగళూరులోని లగ్గెరె ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తున్నాడు. ప్రతి ఏటా జనవరి 8న యశ్ నివాసానికి వచ్చి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవాడు.

అయితే, ప్రముఖ నటుడు అంబరీష్ మృతితో ఈ ఏడాది జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి యశ్ సుముఖత చూపలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. అయినా, బర్త్ డే సందర్భంగా యశ్ నివాసానికి రవి వెళ్లాడు. రవిని కలిసేందుకు యశ్ నిరాకరించడంతో... మనస్తాపానికి గురై యశ్ నివాసం ముందే పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. వెంటనే అతన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా... ఐసీయూలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మరణించాడు.

kannada
hero
yash
fan
suicide
  • Loading...

More Telugu News