vijay devarakonda: నిర్మాతగా విజయ్ దేవరకొండ .. హీరోగా 'పెళ్లిచూపులు' దర్శకుడు?

- విజయ్ దేవరకొండ కొత్త బ్యానర్
- తక్కువ బడ్జెట్లో సినిమా
- మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు
విజయ్ దేవరకొండ తాను ఏది చేసినా కొత్తగా వుండాలని కోరుకుంటాడు. నలుగురికీ భిన్నంగా అనిపించే నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. తాజాగా ఆయన అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హీరోగా వరుస సినిమాలతో బిజీగా వున్న ఆయన, నిర్మాతగా మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.
