Petta: 'బాషా'ను మించిపోయిందట... 'పేట'తో పాత రజనీకాంత్ వచ్చేశాడంటున్న అభిమానులు!

  • 1990లోని రజనీని గుర్తు చేస్తున్న 'పేట'
  • అనిరుధ్ సంగీతం అదుర్స్
  • ట్విట్టర్ లో స్పందిస్తున్న ఫ్యాన్స్

ఇటీవలి కాలంలో వచ్చిన 'కబాలీ', 'కాలా', '2.0'... ఇవన్నీ పాత రజనీకాంత్ ను అభిమానులకు గుర్తు చేయలేకపోయాయనడంలో సందేహం లేదు. కానీ, ఈ ఉదయం  విడుదలైన 'పేట' మాత్రం 1990 దశకంలోని రజనీని గుర్తు చేసిందట. ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడగా, చిత్రం చూసిన వారు సినిమా అద్భుతంగా ఉందని కితాబునిస్తున్నారు.

 యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎం సూపరని అంటున్నారు. ఈ సినిమా రజనీకాంత్ స్టయిల్ లో నడిచిన పక్కా మాస్ సినిమా అని, ‘బాషా’ను మించిపోయిందని చెబుతున్నారు. రజనీ కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు... అభిమానులకు కావాల్సినవన్నీ ఉన్నాయని, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అని మరికొందరు ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. చాలా కాలం తరువాత పాత తలైవా తిరిగి కనిపించాడని అంటున్నారు.









Petta
Rajanikant
New Movie
Anirudh
  • Loading...

More Telugu News