Bihar: 44 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బీహార్ స్పిన్నర్.. 68 వికెట్లు పడగొట్టిన అమన్

  • 44 ఏళ్ల క్రితం 64 వికెట్లు పడగొట్టిన బిషన్ సింగ్ బేడీ
  • సరికొత్త రికార్డు సృష్టించిన అశుతోష్ 
  • మణిపూర్‌పై బీహార్ గెలుపు

బీహార్ జట్టు కెప్టెన్, యువ స్పిన్నర్ అశుతోష్ అమన్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు 68 వికెట్లు తీసిన 32 ఏళ్ల అశుతోష్ 44 ఏళ్లపాటు భద్రంగా ఉన్న బిషన్ సింగ్ బేడీ రికార్డును బద్దలుగొట్టాడు. 1974-75 సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ 64 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడీ రికార్డును అశుతోష్ బద్దలుగొట్టాడు.

మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో సగత్‌పమ్ సింగ్‌ను ఎల్బీగా అవుట్ చేసిన అశుతోష్ రంజీల్లో సరికొత్త రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బీహార్ 3 వికెట్ల తేడాతో మణిపూర్‌పై విజయం సాధించింది. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అయిన అమన్ రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌లలో 6.48 సగటుతో 68 వికెట్లు తీసుకున్నాడు.

Bihar
Ashutosh Aman
Ranji Trophy
Manipur
Bishan Singh Bedi
  • Loading...

More Telugu News