The Accidental Prime Minister: కోర్టుకు వెళ్లాలంటే డబ్బులు లేవు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

  • మన్మోహన్ సింగ్ ను కలిసిన యలమంచిలి శివాజీ
  • 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'పై కోర్టుకు వెళ్లలేను
  • న్యాయవాదులకు డబ్బులు ఇచ్చుకోలేనన్న మన్మోహన్

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద డబ్బులు లేవట. పదేళ్ల పాటు భారతావనికి ప్రధానిగా పనిచేసిన ఆయన వద్ద కోర్టుకు వెళ్లడానికి డబ్బులు లేవట. ఈ విషయాన్ని ఏపీ మాజీ ఎంపీ, తన మిత్రుడు యలమంచిలి శివాజీతో ఆయనే స్వయంగా చెప్పారట.

'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పేరిట మన్మోహన్ బయోపిక్ తెరకెక్కగా, ఈ సినిమా ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు మన్మోహన్ ను కించపరుస్తున్నట్టు కనిపించడంతో వివాదం చెలరేగింది. ఇక ఇదే విషయమై కోర్టును ఆశ్రయించి, పరువు నష్టం దావా వేయాలని మన్మోహన్ సింగ్ కు కొందరు సలహా ఇచ్చారట. ఇదే విషయాన్ని శివాజీ వద్ద ప్రస్తావించిన మన్మోహన్ సింగ్, కోర్టులో పోరాడేందుకు తన వద్ద డబ్బులు లేవని, న్యాయవాదులకు భారీగా ఫీజులు చెల్లించలేనని అన్నారని సమాచారం.

The Accidental Prime Minister
Manmohan Singh
Yalamanchili Sivaji
  • Loading...

More Telugu News