Andhra Pradesh: గౌతమ్ అదానీకి ఎదురెళ్లి మరీ స్వాగతించిన ఏపీ మంత్రి నారా లోకేశ్!

  • గన్నవరానికి చేరుకున్న గౌతమ్ అదానీ
  • కీలక ప్రకటన ఉంటుందన్న నారా లోకేశ్
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మంత్రి

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న అదానీకి ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో కరచాలనం చేశారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపు, ఏపీ ప్రభుత్వం త్వరలోనే చారిత్రాత్మక ప్రకటన చేయబోతున్నాయని ప్రకటించారు. ఈ విషయంలో మరింత స్పష్టత కోసం తనను ఫాలో అవ్వాలని సూచించారు. ఈ మేరకు ఏపీ మంత్రి ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
adani group
Twitter
  • Loading...

More Telugu News