NTR: కొంచం గర్వంగా.. చాలా ఆనందంగా ఉంది!: ‘యన్.టి.ఆర్’ దర్శకుడు క్రిష్

  • ఎన్టీఆర్ గురించి చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉంది
  • ఒక గొప్ప కథ, అందమైన స్క్రీన్ ప్లే వచ్చింది
  • ఎన్టీఆర్ శోభ ఏమాత్రం తగ్గకుండా ప్రెజెంట్ చేశాం
  • కించిత్తు గర్వంగా ఉంది నాకు

ఈ రోజు విడుదలైన ‘యన్.టి.ఆర్’ తొలి భాగం ‘కథానాయకుడు’ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు, దర్శకుడు క్రిష్ చూశారు. అనంతరం, తనని పలకరించిన మీడియాతో క్రిష్ మాట్లాడుతూ, 'మా పని ఇంకా కొనసాగుతోంది. ‘యన్.టి.ఆర్’ పార్ట్ 2 అయిన తర్వాత మళ్లీ మాట్లాడతా'నని అన్నారు. ‘కథానాయకుడు’ గురించి చెప్పాలని మీడియా కోరడంతో క్రిష్ మాట్లాడక తప్పలేదు. 

‘రామారావు గారి గురించి చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉంది. రామారావు గారి గురించిన కథ   ఒక గొప్ప కథ, అందమైన స్క్రీన్ ప్లే వచ్చింది. రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి వస్తున్న కాల్స్ చూస్తుంటే రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్. ఆయన ప్రభ ఏమాత్రం తగ్గకుండా, ఆయన శోభను ప్రెజెంట్ చేసినందుకు కించిత్తు గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఏఎంబీ స్క్రీన్-1లో ఈ సినిమా నేను చూశాను. కొన్ని స్క్రీన్స్ లో ఎఫెక్ట్స్ బాగా ఉండవు కానీ, మేము ఏదైతే ఎంత గొప్పగా తీశామో అంతే గొప్పగా ఈ స్క్రీన్ లో ఉంది. ఇంకోసారి ఆ స్క్రీన్ లోనే సినిమా చూడాలి’ అని క్రిష్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News