naveen patnaik: మహాకూటమిలో మేము చేరడం లేదు: నవీన్ పట్నాయక్

  • మహాకూటమిలో చేరికపై నిర్ణయాన్ని ప్రకటించిన నవీన్ పట్నాయక్
  • కాంగ్రెస్, బీజేపీలకు సమ దూరంలో ఉంటామన్న బీజేడీ అధినేత
  • గత ఎన్నికల్లో 21 లోక్ సభ స్థానాలకు గాను 20 స్థానాలను కైవసం చేసుకున్న బీజేడీ

బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమిలో తాము చేరడం లేదని బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇప్పటి వరకు తాము దూరంగానే ఉంటూ వస్తున్నామని... ఇకపై కూడా తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. బీజేడీ మిగిలిన 20 స్థానాలను గెలుచుకోగా... కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోయింది. 

naveen patnaik
odisha
bjd
mahagathbandhan
congress
bjp
  • Loading...

More Telugu News