tualasi reddy: ఇదేదో చారిత్రక ఘట్టమైనట్టు వైసీసీ నేతలు పోజులు కొడుతున్నారు: తులసిరెడ్డి
- జగన్ పాదయాత్ర వల్ల జనాలకు ఏం ఒరిగింది?
- అది ప్రజాసంకల్ప యాత్ర కాదు.. ప్రజావంచన యాత్ర
- కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఒక మిథ్య
వైసీపీ నేతలపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర ఏదో చారిత్రక ఘట్టమైనట్టు వైసీపీ నేతలు పోజు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. 341 రోజుల పాటు కొనసాగిన జగన్ పాదయాత్ర వల్ల జనాలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. జగన్ ది ప్రజాసంకల్ప యాత్ర కాదని... ప్రజావంచన యాత్ర అని అన్నారు. లోక్ సభలో రాజీనామాలు చేసి, అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న వైసీపీ నేతలకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని... కాంగ్రెస్, టీడీపీ పొత్తును అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ మద్దతు పలుకుతుందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఒక మిథ్య అని అన్నారు.