cellphone sohop: రెండు సెల్‌ఫోన్‌ దుకాణాల్లో చోరీ... రూ.కోటి ఫోన్లు అపహరణ

  • ముసుగు ధరించి వచ్చి దొంగతనం
  • పాల్గొన్న నలుగురు దుండగులు
  • మరికొన్ని చోట్ల చోరీ యత్నం విఫలం

దర్జాగా బొలేరో వాహనంలో వచ్చారు. ముఖాలకు ముసుగులు కట్టుకుని ఓ సెల్‌ఫోన్‌ దుకాణం తలుపులు బలవంతంగా తెరిచి అందులోకి ప్రవేశించారు. ఆ తర్వాత మరో దుకాణంలోకి ప్రవేశించారు. రెండింటిలోని దాదాపు కోటి రూపాయల విలువైన ఫోన్లను మూటకట్టుకుని ఎత్తుకు వెళ్లారు.

తెలంగాణలోని జగిత్యాల పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని షాపుల్లో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. జగిత్యాల యావర్‌ రోడ్డులో భవాని లాట్‌ మొబైల్‌ దుకాణాలున్నాయి. వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు వీటిలోకి ప్రవేశించి ఫోన్లను అపహరించారు. అనంతరం మరికొన్ని షాపుల్లోనూ చోరీకి విఫయత్నం చేసినా ఫలించక పోవడంతో వెనుదిరిగారు. దుండగులు దొంగతనానికి ఎలా పాల్ప డిందీ సీసీ టీవీల్లో రికార్డయి ఉంది. ఈ దొంగతనం స్థానికేతరుల పనేనని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

cellphone sohop
theft
rs. 2 crore poperty
jagithyala
  • Loading...

More Telugu News