Chandrababu: కాపు రిజర్వేషన్లపై పోరాడండి: చంద్రబాబు

  • మంచి కోసం రిజర్వేషన్లను కల్పిస్తే స్వాగతిస్తాం
  • ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు గండి కొడితే ఎదిరిస్తాం
  • దేశంలోని కుట్రలకు ఆరెస్సెస్ కేంద్రంగా మారింది

బీజేపీ, ఆరెస్సెస్ లపై ఏపీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. దేశంలోని కుట్రలకు ఆరెస్సెస్ కేంద్రంగా మారిందని విమర్శించారు. ఆరెస్సెస్ రచిస్తున్న కుట్రలను బీజేపీ అమలు చేస్తోందని చెప్పారు. మంచి కోసం రిజర్వేషన్లను కల్పిస్తే స్వాగతిస్తామని... ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు గండి కొడితే ఎదిరిస్తామని అన్నారు. కాపు రిజర్వేషన్లతో పాటు వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చడంపై పార్లమెంటులో డిమాండ్ చేయాలని తమ ఎంపీలకు సూచించారు. ఈరోజు ఆయన టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పైవ్యాఖ్యలు చేశారు. 

Chandrababu
reservations
kapu
Telugudesam
rss
bjp
  • Loading...

More Telugu News